10-ఇన్ -1 డీప్ రిపేర్ హెయిర్ మాస్క్ డోవ్ ఓఓహెచ్ క్యాంపెయిన్

–   పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా 7 రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రభావం చూపించేలా రూపొందించిన క్యాంపెయిన్

ఎన్నో సంవత్సరాలుగా బ్యూటీ, పర్సనల్ కేర్ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది డోవ్. హెయిర్ కేర్ పరిష్కారాల్లో కూడా అత్యంత నమ్మకమైన మరియు ఎక్కువమంది ఉపయోగిస్తున్న బ్రాండ్. అలాంటి డోవ్ ఇప్పుడు డ్యామేజ్ అయిన జుట్టుని తిరిగి బాగుచేసేందుకు సరికొత్త 10-ఇన్-1 డీప్ రిపేర్ ట్రీట్‌మెంట్ మాస్క్ ని రూపొందించింది. ఇందుకోసం, ఈ ఉత్పత్తి ప్రతీ ఒక్కరికీ చేరువయ్యేలా అద్భుతమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఓఓహెచ్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. “పాజ్, రివర్స్ మరియు ప్లే” పేరుతో ఈ క్యాంపెయిన్ ని సిద్ధం చేసింది. ఈ క్యాంపెయిన్ ద్వారా.. ఇన్నోవేషన్ మరియు కస్టమర్ ఎంగేజ్‌మెంట్ విషయంలో డోవ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని మరోసారి నిరూపితం అయ్యింది.
దేశవ్యాప్తంగా విస్తారమైన మరియు అద్భుతమైన ప్రచారం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించింది డోవ్. అందులో భాగంగా భారతదేశంలోని 4000కి పైగా కీలకమైన టచ్‌ పాయింట్‌ లను ఎంపిక చేసింది. మాల్స్, హైవేలు, నివాస పరిసరాలు, మెట్రో స్టేషన్‌లు మరియు 12 నగరాల్లోని కీలక ప్రదేశాలు వంటి అధిక ట్రాఫిక్ ప్రాంతాలలో వ్యూహాత్మకంగా ప్రచారం యొక్క హోర్డింగులను ఏర్పాటు చేశారు. బెంగళూరు, ఢిల్లీ, ఫరీదాబాద్, ఘజియాబాద్, గుర్గావ్, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, నవీ ముంబై, నోయిడా, పూణే మరియు థానే నగరాల్లో ఎక్కువ ప్రచారం నిర్వహిస్తారు.
ప్రముఖ కూడళ్లలో అందరికి కన్పించేలా డిజిటల్ డిస్‌ప్లే లను (మెరుగైన దృశ్య అనుభవాలు) ఏర్పాటు చేశారు. ఈ బ్రాండ్ నిర్వహించే అతిపెద్ద ఓఓహెచ్ ప్రచారాలలో ఇది కూడా ఒకటి. చూడగానే ఆకట్టుకునే స్క్రీన్‌లు డోవ్ సందేశానికి సరికొత్త జీవం పోస్తాయి.  ఇంకా చెప్పాలంటే పండుగ సీజన్‌ లో మనం ఎలా అయితే అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తామో అలాగే ఇప్పుడు క్యాంపెయిన్ కూడా అలాంటి అనుభవాన్నే అందిస్తుంది.
“జుట్టు సంరక్షణలో డోవ్ నైపుణ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఓఓహెచ్ కీలకమైన మాధ్యమం” అని అన్నారు హెచ్ యు ఎల్ హెయిర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సాయిరామ్ సుబ్రమణియన్ గారు. “ఇది ఇప్పటి వరకు మేం నిర్వహించిన అతిపెద్ద ఓఓహెచ్ ప్రచారం. మేము మా హోర్డింగులను, డిజిటల్ డిస్ ప్లేలను నగరాల్లోని కీలక స్థానాల్లో మరియు వివిధ ఫార్మాట్‌లలో వ్యూహాత్మకంగా ఉంచాం. డోవ్ యొక్క కొత్త 10 ఇన్ 1 డీప్ రిపేర్ ట్రీట్‌మెంట్ ద్వారా జుట్టు పాడవుతుందనే ఆందోళన ఉండదు. అంతేకాకుండా దీనిద్వారా అందమైన జుట్టుని తిరిగి పొందవచ్చనే సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది అని అన్నారు ఆయన.
క్యాంపెయిన్ డోవ్ యొక్క 10-ఇన్-1 డీప్ రిపేర్ ట్రీట్‌మెంట్ హెయిర్ మాస్క్‌ ను హైలైట్ చేస్తుంది. మూడేళ్ల నుంచి పాడైపోతున్న జుట్టుని ఇది తిరిగి మామూలు స్థాయికి తీసుకువచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది*. ఈ పండుగల సీజన్‌కు ఇది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వినియోగదారులు హెయిర్ మాస్క్‌ ను వారి వారపు దినచర్యలో చేర్చుకుని డ్యామేజ్‌పై “హిట్ రివర్స్” చేయవచ్చు. తద్వారా గతంలో ఉన్న అద్భుతమైన మరియు అందమైన జుట్టుని “ప్రెస్ ప్లే”  బటన్ ని నొక్కినొట్లు తిరిగి పొందవచ్చు. దీనిద్వారా మీరు సరికొత్త నూతన విశ్వాసాన్ని పొందుతారు.