దూల్‌పేట్‌లో రూ.10 లక్షల గంజాయి పట్టివేత

– ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రవ్యాప్తంగా మాదకద్ర వ్యాల నిరోదకానికి చేపట్టిన స్పెషల్‌ ఆపరే షన్‌లో భాగంగా దూల్‌పేట్‌లో రూ.10 లక్షల విలువ చేసే 54 కిలోల గంజా యిని పట్టుకున్నట్టు ఎక్సైజ్‌ ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలా సన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరా బాద్‌లోని ఆబ్కారి భవన్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లా డుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కడ గంజాయి పట్టుబడ్డా వాటి మూలా లు ధూల్‌పేట్‌లోనే బయట పడుతు న్నాయని చెప్పారు. ఎక్సైజ్‌, లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు సంయు క్తంగా సోదాలు నిర్వహి స్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ధూల్‌ పేట్‌లో జరిపిన తనిఖీల్లో 15 మంది నేరస్థులను గుర్తించినట్లు చెప్పారు. ఆగస్టు 31లోపు ధూల్‌పేట్‌ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు.