షరతులు లేకుండా కుల వృత్తుల వారికి రూ.10 లక్షలు ఇవ్వాలి

నవతెలంగాణ – వీణవంక
కుల వృత్తుల వారికి దళితులకు దళిత బంధు పథకం అమలు చేసి రూ.10 లక్షలు ఇచ్చినట్లు బీసీ కులాల వారికి రూ. లక్ష కాకుండా రూ.10 లక్షలు ఇవ్వాలని తెలంగాణ రజక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పూసాల సంపత్ డిమాండ్ చేశారు. మండలంలోని మామిడాలపల్లికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వచ్చిన సందర్భంగా ఆయనకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి షరతులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వయస్సు, ఆదాయ నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. వృత్తి దారులు కేవలం వారి వారి కుల వృత్తుల ఆధారంగా మాత్రమే జీవిస్తారని, వారు ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదని వెంటనే ప్రభుత్వం స్పందించి నిబందనలు ఎత్తేయాలని కోరారు.