డ్రంకెన్ డ్రైవ్ కేసులో 10 మందికి శిక్ష..

10 people sentenced in drunken driving case– మద్యం మత్తులో వాహనాలు నడపకండి..
– వేములవాడ రూరల్ ఎస్ ఐ మారుతీ..
నవతెలంగాణ – వేములవాడ రూరల్ 
వేములవాడ రూరల్ మండల పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన 10 మందికి జ్యూడిషల్ ఫస్ట్ క్ క్లాస్ మేజిస్ట్రేట్ శనివారం  శిక్ష వేధించారు. కాగా 10 మందిలో ముగ్గురికి ఒక రోజు జైలు శిక్ష తో పాటు వెయ్యి రూపాయలు జరిమానా, మిగతా ఏడుగురికి ఒక్కొక్కరికి రూ.1500/- జరిమానా విధించటం జరిగింది అని తెలిపారు. ఈ సందర్బంగా రూరల్ ఎస్ ఐ మారుతీ మాట్లాడుతూ.. మద్యం తాగి వాహనాలు నడపకూడదు అని అది మీకు, ఎదుటి వారికి ప్రమాదం అని హెచ్చరించారు. మీకు ప్రమాదం జరిగితే అది మీ కుటుంబం కి తీరని లోటు అని జరిమానా లు తాత్కాలికం అని మీలో మంచి ప్రవర్తన కోసమే అని, మార్పు మీలోనే జరగాలి అని కోరారు.