రేషన్ కార్డ్ లేని వంద దరఖాస్తు దారులు అర్హులుగా నిర్ధారణ: ఏఓ

100 applicants without ration card declared eligible: AOనవతెలంగాణ – అశ్వారావుపేట
ఇప్పటి వరకు రేషన్ లేని కారణంగా ఋణ మాఫీ జాబితాలో చోటు దక్కని వందమంది దరఖాస్తు దారులను ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ ద్వారా బుధవారం మ్యాపింగ్ చేసి ఋణ మాఫీ కి అర్హులుగా నమోదు చేసామని వ్యవసాయ శాఖ మండల అధికారి శివరాం ప్రసాద్ తెలిపారు. ఋణం పొంది రేషన్ కార్డ్ లేని కారణంతో అనర్హత పొందిన వారు నేటివరకు 2188 మంది దరఖాస్తు చేసుకున్నారని,వారందరిని మ్యాపింగ్ ద్వారా గుర్తిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో లు సతీష్,నాగేంద్ర,షకీరా భాను లు ఉన్నారు.