100 డేస్ ప్రోగ్రాం ను సక్రమంగా నిర్వహించాలి

పోచం డిటిడిఓ
నవ తెలంగాణ-గోవిందరావుపేట: 100 డేస్ ప్రోగ్రాంలో సక్రమంగా నిర్వహించాలని ఎటునాగారం డిటిడిఓ పోచం అన్నారు. మంగళవారం మండలంలోని కర్లపల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలను డిటిడిఓ పోచం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోచం మాట్లాడుతూ పాఠశాలలోని 10వ,తరగతి విద్యార్థుల 100 డేస్ ప్రోగ్రాం సక్రమంగా నిర్వహించి ప్రతి సబ్జెక్టు లో ఉత్తమ ఫలితాలు అందేలా కృషి చేయాలన్నారు. రానున్న పరీక్షలు మీ లక్ష్యాలను నిర్దేశిస్తాయన్నారు. ప్రతి ఉపాద్యాయునివద్ద లేసన్ ప్లాన్, టీచర్ డైరీ ఉండాలన్నారు. మెను ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ బి. బాలు కి సూచించారు 9వ తరగతి,4వ తరగతి పిల్లలను ఇంగ్లీష్ చదివించారు ప్రదానోపాధ్యాయులు కల్తీ.శ్రీనివాస్ తో ప్రతిరోజూ విద్యార్థుల చూచిరత కాపీలను చూసి మంచిగా రాసే విదంగా ప్రతి ఉపాద్యాయుడు ప్రోత్సహించాలన్నారు తదుపరి పరీక్షల గ్రేడు,స్టూడెంట్స్ రిజిస్టర్స్, ఉపాద్యాయుల రిజిస్టర్ లు పరిశీలించారు విద్యార్థుల హాజరుశాతం పెంచి పాఠశాల ప్రగతికి తోడ్పడాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాద్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.