
ప్రతి గ్రామపంచాయతీలో 100% ఇంటి పన్నులు వసూలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. గురువారం భిక్కనూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో కార్యదర్శులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున నెల చివరి వరకు 100% ఇంటి పన్నులు వసూలు చేయాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ అభివృద్ధి పనుల ప్రణాళిక తయారుచేసి పూర్తి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఎంపీఓ ప్రవీణ్ కుమార్, మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.