‘దేవకి నందన వాసుదేవ’తో హీరో అశోక్ గల్లా అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ప్రశాంత్ వర్మ కథ అందించారు. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకష్ణ నిర్మించారు. ఈనెల 22న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో సుధీర్ బాబు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి, చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ,’ప్రశాంత్ వర్మ ఒక సినిమాతో వస్తున్నారంటే అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఆయన కథ ఇవ్వడంతో బాలా చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని తీశారు. అర్జున్ చాలా గ్రేట్ విజన్‌తో అద్భుతంగా తెరకెక్కించారు. మా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. మీరు డెఫినెట్‌గా ఎంజాయ్ చేసేలా ఉంటుంది’ అని తెలిపారు. ‘ఈ కమర్షియల్ డివైన్ థ్రిల్లర్‌లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో సత్యభామగా అలరిస్తా. నటిగా అర్థవంతమైన కథలు చెప్పాలని తొలి అడుగు వేస్తున్నాను’ అని హీరోయిన్ మానస వారణాసి చెప్పారు. డైరెక్టర్ అర్జున్ జంధ్యాల మాట్లాడుతూ,’టీమ్ సహకారంతో అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది. ప్రశాంత్ కథ ఇచ్చారు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆయనకి చూపించాను. చూసి ఆయన చాలా సర్‌ప్రైజ్ ఫీల్ అయ్యారు. చాలా అద్భుతంగా డెవలప్ చేసి తీశావ్ అన్నారు. ఈ సినిమా మీద నమ్మకంతో నిర్మాత బాల మొదటి పది నిమిషాలను ముందే చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అద్భుతమైన సినిమాని తీశారని ప్రశంసిస్తారు. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు’ అని అన్నారు. ‘ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఈ సినిమా ష్యూర్ షాట్ హిట్. ఇది 100% మంచి సినిమా. రిలీజ్‌కి ముందే సినిమాలోని పది నిమిషాలను ప్రదర్శించామంటే అందరూ అర్థం చేసుకోవచ్చు. సినిమా ఫలితం పై మేం చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని చెప్పారు.