వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

– పదిలో ఉత్తమ ఫలితాల సాధనకు స్పెషల్ క్లాసులు
– వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
నవతెలంగాణ – మల్హర్ రావు
పదో తరగతి వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా మండలంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కసరత్తు ప్రారంభించారు.ఈ వార్షిక సంవత్సరంలో ఎడ్లపల్లిలోని మోడల్ స్కూల్లో 68, తాడిచెర్ల హైస్కూల్లో 47, మల్లారం హైస్కూల్లో 17, వళ్లెంకుంట హైస్కూల్లో 06, రుద్రారం హైస్కూల్లో  07,  పెద్దతూoడ్ల హైస్కూల్లో  02, దుబ్బపేటలోని కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో 26, మండలంలో బాలికలు 87,బాలురు 86, మొత్తం 173 మంది విద్యార్థులను ఉపాధ్యాయులు పక్క ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. రెండు నెలల ముందు నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.8మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున గ్రూపుగా ఏర్పడి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన అందిస్తూ ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.గత నాలుగైదు ఏళ్లుగా మంచి ఫలితాలు సాధిస్తూ ఉత్తమ ప్రతిభ కన్సబరుస్తున్నారు.ఈ సారి కూడా మంచి ప్రతిభ కనబర్చాలనే ఉద్దేశ్యంతో ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేస్తున్నారు.
పక్కా ప్రణాళికలతో: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రయివేటు కార్పోరేట్ పాఠశాలకు దీటుగా మెరుగైన విద్యను అందించడానికి ప్రభుత్వం అర్హులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఇందుకు ఉపాధ్యాయులు పక్క ప్రణాలికతో ప్రత్యేక తరగతులు ప్రారబించారు.తాడిచెర్ల హైస్కూల్, ఎడ్లపల్లి మోడల్ స్కూల్ తోపాటు జిల్లా పరిషత్ పాఠశాలల్లో పదోవ తరగతి ఫలితాలు ఆదర్శంగా నిలిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. గత నాలుగేళ్లలో 90 శాతం నుంచి వంద శాతం ఫలితాలు వచ్చాయి.ఈ ఏడాది మండలంలో జిల్లా పరిషత్,మోడల్,కస్తూరిబ్బా  మొత్తం 173 మంది విద్యార్థుల్లో 90 శాతం 9జిపిఏ సాధించాలనే ఉద్దేశ్యంతో పక్క ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. మార్చిలో పరీక్షలు ఉండడంతో గతేడాది నవంబర్ నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.ఉదయం 7.45 గంటల 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నారు.సబ్జెక్టులో ఏవైనా సందేహాలుంటే నీవృతి చేయడానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటున్నారు.గ్రూపు డిస్కషన్,స్లిప్ టెస్టులు, కాంపేటేటివ్ పరీక్షలు పెడుతున్నారు.
10 జీపిఏ సాధించాలనే పట్టుదల, చరణ్ 10వ తరగతి విద్యార్థి: రెండు నెలల ముందు నుంచే సార్లు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు.వివిధ సబ్జెక్ట్ లో సందేహాలు ఉంటే నీవృతి చేస్తున్నారు. ప్రదనోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు.ఈ సారి 10 జిపిఏ సాధించాలని పట్టుదలతో చదువుతున్నాను.
సమిష్టి కృషితో పని చేస్తున్నాం మల్కా భాస్కర్ రావు, తాడిచెర్ల హైస్కూల్  ప్రాధానోపాధ్యాయుడు:  వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం.గత నాలుగైదు ఏళ్లుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం.ఈ సారి వందశాతం ఫలితాలకు కృషి చేస్తున్నాం.ఉపాధ్యాయులు సమిష్టి కృషితో పని చేస్తున్నారు. విద్యార్థులు కూడా పట్టుదలతో చదువుతున్నారు.