
మంగళవారం వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉప్పునుంతల మండలంలో ఉన్న 6 స్కూల్స్ కు చెందిన 239 మందికి గాను 239 మంది విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. జడ్పిహెచ్ఎస్ ఉప్పునుంతల 56 మంది విద్యార్థులు కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల 48, జడ్పీహెచ్ఎస్ కంసానిపల్లి 18, జడ్పిహెచ్ఎస్ పెనిమిల్ల 21, జడ్పిహెచ్ఎస్ వెల్టూర్ 23, మహాత్మా జ్యోతిరావు పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ 73 మంది విద్యార్థులు 9.0 పైనే 100కు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కు చెందిన విద్యార్థి త్రిష 10.0 అదే విదంగా జడ్పీహెచ్ఎస్ ఉప్పునుంతల పాఠశాలకు చెందిన సమీరా 9.8 తో మండల టాపర్లుగా రికార్డు సృష్టించినట్లు పాఠశాల ప్రదానోపాధ్యాయులు జటప్రోలు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,మండల ప్రజలు అభినందించి ఆశీర్వదించారు.