– ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటైనా గెలవని పార్టీ వంద సీట్లు ఎలా గెలుస్తుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. ఆర్నెళ్ల క్రితమే బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారనీ, లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి 16 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదని చెప్పారు. తెలంగాణలో నిరంకుశత్వాన్ని తరిమికొట్టి ప్రజలు ప్రజాస్వామ్య పాలనను తెచ్చుకున్నారని తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ నాయకులతో చరణ్ కౌశిక్ యాదవ్, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, డాక్టర్ లింగం యాదవ్, భాస్కర్ యాదవ్, వచన్ కుమార్‌తో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్‌లో పోస్టులు పెట్టడం తప్ప.. ప్రజల వద్దకు వెళ్లింది లేదని చెప్పారు. ఎక్స్‌వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్న కేటీఆర్‌కు ఎలాన్ మస్క్ సన్మానం చేస్తారని ఎద్దేవా చేశారు.బామ్మర్ది టిల్లు.. బావ సొల్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పదేండ్లలో ఇచ్చిన రెండు మ్యానిఫెస్టోలను తీసుకుని వస్తే వాటిపై బహిరంగంగా చర్చిద్దాం…రాండి అంటూ సవాల్ విసిరారు. అందులో ఎన్ని అమలు చేశారో, ఎన్ని చేయలేదో ప్రజలకు తెలుస్తుందన్నారు.