నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
ఇంటి పనులు 100% వసూలు చేయాలని ఎంపీవో శ్రీనివాస్ అన్నారు. శనివారం మండలంలోని అచ్చాయిపల్లి గ్రామపంచాయతీ రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 100% పన్నులు వసూలు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. అదేవిధంగా గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు.