ఎఎస్‌టీసీకి 100 టాటా విద్యుత్‌ బస్సులు

గౌవతి : అసోం స్టేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎఎస్‌టీసీ)కు 100 విద్యుత్‌ బస్సులను సరఫరా చేసినట్టు దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహనాల తయారీదారు టాటా మోటార్స్‌ ప్రకటించింది. 9-మీటర్ల, ఎయిర్‌ కండిషన్డ్‌ టాటా అల్ట్రా ఇవి బస్సులు గౌహతి రోడ్లపై తిరుగనున్నాయని పేర్కొంది. ఈ జీరో ఎమిషన్‌ బస్సులను దేశీయంగా తయారు చేసినట్టు తెలిపింది. ఇప్పటి వరకు భారత్‌లో 1,500 పైగా ఇవి బస్సులను సరఫరా చేసినట్టు పేర్కొంది.