100 ఏండ్ల భారత విశ్వవిద్యాలయాల సంఘ గ్రంథాలయం

100 years of India University Community Libraryలూసియో టాన్‌ చెప్పినట్టు నాణ్యమైన విద్య లేకుండా మనం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందలేం. దానికి అనుగుణంగా 1919లో సాడ్లర్‌ కమిషన్‌ ఉన్నత విద్యలో నాణ్యమైన విద్యను, పరిశోధనను, సమాజానికి అందించే ఉద్దేశంతో పటిష్టమైన సంస్థ అవసరమని భావించింది. దాని ద్వారా సమాచారాన్ని పంచుకోవచ్చని అభిప్రాయపడింది. విద్య, సంస్కృతి, క్రీడలు, అనుబంధ రంగాల్లో సహకారాన్ని పెంచడం ద్వారా విశ్వవిద్యాలయ కార్యకలాపాలను ప్రోత్సహించడం అనే లక్ష్యంతో నూతన సంస్థ అవసరముందని సిఫార్సు చేసింది.
భారతదేశంలో ఉన్నత విద్యావ్యవస్థ పటిష్టతకు, నాణ్యమైన విద్యకు పరిశోధనకు ఒక పటిష్టమైన విద్యాసంస్థ ఏర్పాటు చేసే ఉద్దేశంతో సరిగ్గా నూరు వసంతాల కింద మార్చి 23, 1925న బాంబే యూని వర్సిటీలో వైస్‌ ఛాన్సలర్ల సమావేశం జరిగింది. అపెక్స్‌ ఇంటర్‌- యూనివర్సిటీ ఆర్గనైజేషన్‌గా ఇంటర్‌ -యూనివర్సిటీ బోర్డ్‌  ఏర్పడింది. విద్యార్థులతో పాటు విశ్వ విద్యాలయాల ప్రయోజనాలను కాపాడేందుకు, సమన్వయ సంస్థ అవసరమై ఈ సంస్థను ఏర్పాటు చేసింది. అన్ని విశ్వవిద్యాలయాలను ఏకతాటిపైకి తీసుకు రావడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ సంస్థకు తొలి అధ్యక్షులుగా డాక్టర్‌ అక్బర్‌ హైదర్‌ నవాబ్‌ (హైదర్‌ నవాజ్‌జంగ్‌ బహదూర్‌) గణనీయమైన సేవలు అందించి సంస్థ ఆవిర్భావానికి నూతన జవసత్వాలు అందించడానికి విశ్వప్రయత్నం చేశారు. ప్రస్తుతం 103వ అధ్యక్షులుగా ఆచార్య వినరుకుమార్‌ పాతక్‌ సేవలందిస్తున్నారు.
ఇంటర్‌-యూనివర్సిటీ బోర్డ్‌ను 1973లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీస్‌ గా పేరు మార్చారు. ఉన్నత విద్యాభివృద్ధి, నాణ్యమైన విద్య, పరిశోధన వంటి సేవలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఈ సంస్థ చురుకుగా సేవలందిస్తున్నది. సంఘంలో అన్ని రకాల విశ్వవిద్యాలయాలు (సంప్రదాయ విశ్వ విద్యాలయాలు, ఓపెన్‌ యూనివర్సిటీలు, రాష్ట్ర, కేంద్రీయ, ప్రయివేటు విశ్వ విద్యాలయాలు, జాతీయ ప్రాము ఖ్యత కలిగిన సంస్థలు) సభ్యులుగా కలిగి ఉన్నారు. వీటితో పాటు బంగ్లాదేశ్‌, భూటాన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కజకిస్త్తాన్‌, మలేషియా, మారిషస్‌, నేపాల్‌, థాయిలాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, యునైటెడ్‌ కింగ్డమ్‌ నుంచి 13 విశ్వ విద్యాలయాలు/ ఇన్‌స్టిట్యూట్‌లు, వాటి అసోసియేట్‌ సభ్యులు ఈ సంఘంలో ఉన్నారు.
ప్రధాన ఉద్దేశం
భారతీయ ఉన్నత విద్యను ప్రపంచంలోనే అగ్రగామి వ్యవస్థగా బలోపేతం చేయడానికి, నాణ్యమైన విద్యను అందించడం, ఉన్నతస్థాయి పరిశోధనలు చేసేందుకు అవసరమైన కార్యకలాపాలు రూపొందించడంలో జాతీయ అంతర్జాతీయ స్థాయి సహకారాన్నిస్తుంది. అవసరమైతే ఆయా విభాగాలకు ప్రోత్సాహకాలు అందించే సంస్థలతో సత్సంబంధాలు కొనసాగించి పరిశోధకులకు, అధ్యాపకులకు, విద్యార్థులకు తగిన సహకారాన్ని అందిస్తుంది. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యువతకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడంలోనూ ముందుంటుంది.
అదేవిధంగా జాతీయ, అంతర్జాతీయ ఫోరమ్‌ లలో భారతీయ విశ్వవిద్యాలయాలను ప్రోత్స హించడంతో పాటు, సభ్య విశ్వ విద్యాలయాల మధ్య క్రియాశీల మద్దతు, సహకారం, సమన్వయం ద్వారా ప్రభుత్వ, జాతీయ/ అంతర్జాతీయ ఉన్నత విద్యా సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోదర సంఘాలు, విశ్వవిద్యాలయాల మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరిచేందుకు సహకరిస్తుంది. సభ్యులుగా ఉన్న విశ్వవిద్యాలయాల మధ్య కమ్యూనికేషన్‌ను సులభతరం చేయడానికి, సమన్వయం, పరస్పర సంప్రదింపులతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య భారతదేశ విశ్వవిద్యాలయాల సంఘం అనుసంధాన కర్తగా ఉంటూ విశ్వవిద్యాలయాల ప్రతినిధిగా వ్యవహరిస్తుంది.
Audrey Hepburn quality education has the power to transform societies in a single generation, provide children with the protection they need from the hazards of poverty, labor exploitation and disease, and given them the knowledge, skills, and confidence to reach their full potential  బోధన, పరీక్ష, పరిశోధన, పాఠ్య పుస్తకాలు, పండితుల ప్రచురణలు, గ్రంథాలయాల ఉన్నతికి దోహదపడే ఇతర కార్యక్రమాల నిర్వహణలో అదేవిధంగా ప్రమాణాలను మెరుగు పరచడంలో సహాయపడే కార్యక్రమా లను రూపొందిస్తుంది. మన దేశంలో లేదా విదేశాల్లోని విశ్వవిద్యాలయాల మధ్య విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకుల బోధన, పరిశోధనా సిబ్బంది సభ్యుల మార్పిడి, మౌలిక సదుపాయాల భాగస్వామ్యం, ఉమ్మడి-పరిశోధన ప్రాజెక్టులు, ప్రచురణలకు సహాయ సహకారాలు అందించేందుకు దోహద పడుతుంది. విద్యార్థులకు భారతీయ, విదేశీ ఇతర విశ్వవిద్యాలయాల నుంచి వారి డిగ్రీలు, డిప్లొమాలు, పరీక్షలకు గుర్తింపు వంటి విషయాల్లో ఆయా యూనివర్సిటీలకు సహకరి స్తుంది. ఉన్నత విద్యకు సంబంధించిన వివిధ అంశాలపై సదస్సులు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలు, పరిశోధనలను నిర్వహిస్తుంది.
ఏజెన్సీలతో సన్నిహిత సంబంధాలు
యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌, డిపార్ట్మెంట్‌ ఆఫ్‌ సెకండరీ అండ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌, మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌, యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌; నేషనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌, దూర విద్యా మండలి, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌, వివిధ రాష్ట్రాల విద్యాశాఖలు, ఉన్నత విద్య రాష్ట్ర మండలి సంస్థలకు ఉన్నత విద్యలో నాణ్యమైన పరిశోధనలకు విద్యకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు, అదేవిధంగా ఆయా సంస్థలతో కలిసి పనిచేస్తూ నాణ్యమైన ఉన్నత విద్యని ఈ సమాజానికి అందించే ప్రయత్నం చేస్తుంది.
యూనివర్సిటీ న్యూస్‌ అనే వారపత్రిక భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం ప్రచురిస్తుంది. ఉన్నత విద్యలోని విద్యావేత్తలు, అధ్యాపకులు, విధాన రూపకర్తలు, నిర్వాహకులు, అదేవిధంగా ఉన్నత విద్యలో జాతీయ, అంతర్జాతీయంగా విభిన్న కోణాల్లో ఆసక్తి ఉన్న వాటాదారులు తమ తమ అభిప్రాయాలను ఈ వారపత్రికల్లో ప్రచురిస్తారు. 1929 నుంచి నేటివరకు ఉన్నత విద్యలో జరుగుతున్న పరిణామాలను, నూతన ఆవిష్కరణలను, నూతన పఠణ పద్ధతులను, పరిశోధనలు, నూతన పోకడలను సవివరంగా వివరిస్తుంది.
పరిశోధనా విభాగం
1975లో భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో పరిశోధనా విభాగం స్థాపించారు. 1993లో రీసెర్చ్‌ డివిజన్‌గా ఎదిగి విద్యావ్యవస్థలో వస్తున్న నూతన పోకడలకనుగుణంగా ఉన్నత విద్యను తీర్చిదిద్దడంలో కావలసిన సహాయ సహకారాలు ఈ పరిశోధన సంస్థలకు, పరిశోధకులకు, బోధకులకు అందించింది. అదేవిధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వాలకు పాలసీ మేకర్లకు తగిన సలహాలు సూచనలు అందిస్తూ ఉన్నది.
అడ్వాన్స్‌ టీచింగ్‌, ఉన్నత విద్యా రంగంలో తాజా పరిణామాలపై పరిశోధకులకు, విద్యార్థులకు, అధ్యాపకులకు నైపుణ్యమైన సమాచారాన్ని అందించేందుకు ఈ పరిశోధనా సంస్థ పని చేస్తున్నది. జాతీయ పునర్నిర్మాణం కోసం బలమైన సైద్ధాంతిక పునాదిని సృష్టించే లక్ష్యంతో డివిజన్‌ విద్యా కార్యకలాపాలు నిర్వహితమవుతాయి. ఈ పరిశోధనా సంస్థ రీసెర్చ్‌ ప్రాజెక్ట్‌లు, వర్క్‌షాప్‌ / సెమినార్‌, అన్వేషన్‌ – స్టూడెంట్‌ రీసెర్చ్‌ కన్వెన్షన్‌, ఉపకులపతుల రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లు, డేటా-బేస్‌ యాక్టివిటీస్‌, పబ్లికేషన్స్‌ వంటి కెపాసిటీ బిల్డింగ్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాయి.
గ్రంథాలయం
The very existence of Libraries
affords the best evidence that we
may yet have hope for the future of
man. – T S Eliot
ఈ సంఘం సభ్య విశ్వవిద్యాలయాల పరిశోధకులకు, విద్యార్థులకు, బోధకులకు, నాణ్యమైన సమాచారాన్ని అందించాలని ఉద్దేశంతో 1964లో లైబ్రరీ, డాక్యుమెంటేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. 2019 నాటికి ఉన్నత విద్యలో అద్భుతమైన సమాచార వనరుల కేంద్రంగా ఎదిగింది. ఇది రిఫరెన్స్‌ లైబ్రరీ, రిసోర్స్‌సెంటర్‌గా హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లోని విద్యార్థులకు/ పరిశోధకులకు/అధ్యాపక సభ్యులకు దాని సేవలను అందిస్తుంది. ఉన్నత విద్యపై నాలెడ్జ్‌ బేస్‌గా పనిచేస్తుంది. కేంద్రం ఉన్నత విద్యపై జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలు, జర్నల్స్‌ కలిగి ఉన్న గొప్ప గ్రంథాలయం.
ఈ గ్రంథాలయంలో 25,000 కంటే ఎక్కువ పుస్తకాలు, 150 పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఈ సమాచార వనరుల కేంద్రం ప్రత్యేకించి ఫెడరల్‌ ప్రభుత్వం/ ఖ+జ ద్వారా ఏర్పాటైన వివిధ కమీషన్‌/కమిటీ నివేదికలు, ఇతర ప్రభుత్వ విధాన పత్రాల సేకరణలో ప్రత్యేకంగా ఉంటాయి. వివిధ విశ్వవిద్యాలయాల వార్షిక నివేదికలు, క్యాలెండర్లు, హ్యాండ్‌బుక్‌లు, చట్టాలు ఉన్నత విద్యపై వివిధ రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు, విశ్వవిద్యాలయ వార్తల జర్నల్స్‌ వాల్యూమ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి.
దీనితో పాటు ఈ గ్రంథాలయంలో వివిధ రకాల సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలు, ఎన్‌సైక్లోపీడియాలు, ఇయర్‌ బుక్స్‌, పది రకాల వార్తాపత్రికలు, ఆంగ్లం, హిందీలో మూడు రకాల వార్తాపత్రికలు, వార పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఉన్నత విద్యకు సంబంధించిన జర్నల్స్‌ పిరియాడికల్‌ దాదాపు 20వరకు అందుబాటులో ఉన్నాయి. నిత్యం గ్రంథాలయానికి పరిశోధకులు, బోధకులు, సైంటిస్టులు పరిశోధన అవసరార్థం విచ్చేస్తుంటారు. ఉదయం 10:00 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాఠకులకు సేవలు అందిస్తున్నది.
ఉన్నత విద్యావ్యవస్థకు సంబంధించి వివిధ విశ్వవిద్యాలయాల హ్యాండ్‌ బుక్కులు, ఆయా సంస్థలు నిర్వహించే జాతీయ అంతర్జాతీయ సెమినార్ల పుస్తకాలు, వివిధ జాతీయ విద్యాసంస్థలు నిర్వహించే మహాసభల పుస్తకాలు, ఆయా సంస్థలు ప్రచురించే పుస్తకాలు అన్ని ఈ గ్రంథాలయంలో కొలువుదీరినాయి.
ఈ గ్రంథాలయంలో అధునాతన కంప్యూటర్‌ ల్యాబ్‌, ఉచిత అంతర్జాల సౌకర్యం వైఫై ఫెసిలిటీ వల్ల పుస్తకాలు, జర్నల్స్‌, డాటాబెస్‌లు, పరిశోధకులు, బోధకులు ఉపయోగించుకుంటున్నారు.
సభ్యుల అభ్యర్థనపై సబ్జెక్ట్‌ బిబ్లియోగ్రఫీలపై సమాచారాన్ని, ఉన్నత విద్యా వ్యవస్థపై ఎంపిక చేసిన సమాచారాన్ని అందిస్తుంది. అదేవిధంగా వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసిన జాతీయ అంతర్జాతీయ సెమినార్ల కాన్ఫరెన్స్‌ వాల్యూమ్‌లు, ఆయా విశ్వవిద్యాలయాలను ప్రచురించే పుస్తకాలు కూడా ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఈ గ్రంథాలయం పరిశోధకులకు, బోధకులకు ఉపకులపతులకు వివిధ సేవలను అందజేస్తుంది. సర్క్యులేషన్‌, రిఫరెన్స్‌, ప్రెస్‌ క్లిప్పింగ్‌ (వివిధ పత్రికల్లో ఉన్నత విద్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం), బిబ్లియోగ్రాఫిక్‌, రిప్రోగ్రాఫిక్‌, సెలెక్టివ్‌ ఇన్ఫర్మేషన్‌ డిస్సెమినేషన్‌ యూనివర్సిటీ వార్తల కోసం ఇండెక్సింగ్‌ మొదలగు సేవలను అందిస్తున్నది.
ఈ గ్రంథాలయం సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో డాక్టోరల్‌ డిసర్టేషన్లపై బిబ్లియోగ్రఫీని రూపొందించింది. ప్రతినెల దేశవ్యాప్తంగా డాక్టర్‌ డిసర్టేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని యూనివర్సిటీ న్యూస్‌ వార పత్రికలో ప్రచురిస్తుంది.
ఈ గ్రంథాలయంలో పుస్తకాలు, రిపోర్టులు, జర్నల్స్‌ ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌, ఆన్‌లైన్‌ డాటా బేసెస్‌, ఈ సంస్థ ప్రచురించే పత్రికలు, పుస్తకాలను అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా యూనివర్సిటీస్‌ ఆఫ్‌ హ్యాండ్‌ బుక్‌, యూనివర్సిటీ న్యూస్‌ ప్రారంభ తేదీ నుంచి ఇప్పటివరకు గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయి.
ఉన్నత విద్యకు సంబంధించినటువంటి కమిషన్లు కమిటీలు వాటి రిపోర్టులకు సంబంధించిన డాటా బేస్‌ అందుబాటులో ఉన్నది. ఈ గ్రంథాలయంలో పరిశోధకుల పరిశోధన గ్రంథాలు, పరిశోధకులు, బోధకులు రాసిన పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పరిశోధకులు ప్రచురిస్తున్న పుస్తకాలు కానీ ఆర్టికల్స్‌ కానీ నాణ్యమైన వాటిని ఆవిష్కరించేందుకు ఆంటీ ప్లాగరిజం సాఫ్ట్‌వేర్‌ ఉర్‌ కుండ్‌… కూడా అందుబాటులో ఉన్నది. వివిధ సంస్థలు అందించే లైబ్రరీ, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ కోర్సుల గురించి సవివరమైన సమాచారాన్ని కలిగి ఉన్న లైబ్రరీ, ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌పై హ్యాండ్‌ బుక్‌ను కూడా అందిస్తుంది.
యూనివర్సిటీ న్యూస్‌: ఎ వీక్లీ జర్నల్‌ ఆఫ్‌ హయ్యర్లో రెగ్యులర్‌ ఫీచర్‌గా ప్రచురించబడిన ”థీసెస్‌ ఆఫ్‌ ది మంత్‌” అనే కాలమ్‌ క్రింద సైన్స్‌ డ టెక్నాలజీ, సోషల్‌ సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ రంగంలో భారతీయ విశ్వవిద్యాలయాలు ఆమోదించిన డాక్టోరల్‌ థీసెస్‌పై గ్రంథ పట్టిక సమాచారాన్ని ఈ గ్రంథాలయం ద్వారానే అందిస్తారు.
డా. రవికుమార్‌ చేగోని
9866928327