కేవలం 6 రోజుల్లో రూ.1000 కోట్లు

In just 6 days 1000 croresభారతీయ సినిమా చరిత్రలో ‘పుష్ప 2 : ది రూల్‌’ సినిమా సరికొత్త రికార్డ్‌ని క్రియేట్‌ చేసింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 రోజుల్లోనే రూ.1000 కోట్లకి పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. తక్కువ రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరిన సినిమాగానే కాకుండా ఇప్పటివరకు గత సినిమాలు చేసిన రికార్డులను ఇది సరికొత్తగా తిరగరాసి నూతన అధ్యాయానికి నాంది పలికింది.అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘పుష్ప 1’ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప-2 ది రూల్‌’ తెరకెక్కింది. ఈనెల 5వ తేదీన ఈ సినిమా  పంచవ్యాప్తంగా దాదాపు 12 వేల థియేటర్లలో విడుదలైంది. మైత్రీ మూవీమేకర్స్‌తో సుకుమార్‌ రైటింగ్‌ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే  రిలీజ్‌  జినెస్‌లోనూ మన దేశంలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. అలాగే విడుదలకు ముందు రోజు వేసిన పెయిడ్‌ ప్రీమియర్స్‌ నుంచే సెన్సేషనల్‌ బ్లాక్‌బస్టర్‌ టాక్‌ని సొంతం  సుకుంది. అల్లు అర్జున్‌ నట విశ్వరూపం, సుకుమార్‌ వరల్డ్‌ క్లాస్‌ టేకింగ్‌కి ప్రపంచ సినీ ప్రేమికులు ఫీదా అయిపోయారు అని మేకర్స్‌ తెలిపారు. మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు.. నాలుగవ రోజు.. ఐదవ రోజు.. ఆరవ రోజు వసూళ్లలో వరుసగా ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సష్టించిన ఈ చిత్రం ఆరు రోజుల్లో రూ.1002 కోట్లు వసూలు చేసి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత వేగవంతగా రూ.1000 కోట్లు కలెక్ట్‌ చేసిన తొలి చిత్రంగా సరికొత్త రికార్డును నెలకొల్పిందని, అలాగే ప్రతి భాషలో సునామీలా దూసుకపోతున్న ఈ సినిమా బాలీవుడ్‌లో సైతం జైత్రయాత్రను కొనసాగిస్తోందని, బాలీవుడ్‌లో ఆరు రోజులకు రూ. 375 కోట్లు కలెక్ట్‌ చేసి, తక్కువ రోజుల్లోనే భారీ వసూళ్ళని కలెక్ట్‌ చేసిన తొలి హిందీ చిత్రంగానూ నిలిచిందని మేకర్స్‌ సంతోషం వ్యక్తం చేశారు.