హైదరాబాద్ : జెన్‌సోల్ ఇంజినీరింగ్ లిమిటెడ్ అనుబంధ సంస్థ స్కార్పియస్ ట్రాకర్స్ ప్రపంచ వ్యాప్తంగా 1000 మెగావాట్ కాంట్రాక్ట్ ఆర్డర్ల మైలురాయికి చేరినట్లు తెలిపింది. తమ సంస్థ భారత్, జపాన్, సౌదీ అరేబియా, ఉగాండా దేశాల్లో కాంట్రాక్టు ఆర్డర్‌లను పొందినట్లు పేర్కొంది. కాంట్రాక్ట్ ఆర్డర్‌ల మైలురాయిని దాటడం మాత్రమే కాదని.. ఇది తమ సామర్థ్యం ప్రదర్శనకు నిదర్శనమని స్కార్పియస్ ట్రాకర్స్ సీఈఓ శైలేష్ వైద్య పేర్కొన్నారు. ఇందులో తమ బృందం కృషి ఘనత ఎంతో ఉందన్నారు.