భారతరత్న అవార్డు గ్రహీత కర్పూరి రాకూర్ నాయి 101వ జయంతి వేడుకలను శుక్రవారం కాటారం కేంద్రంలో నాయి బ్రాహ్మణులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సబ్ డివిజన్ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొయ్యల రాజయ్యనాయీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయ గిరి సమ్మయ్య నాయి హాజరై మాట్లాడారు బీహార్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ ముద్దుబిడ్డ భారతరత్న బీహార్ రాష్ట్రంలో సమాప్తి పూర్ జిల్లా పీతాంజియా గ్రామంలో ఒక నిరుపేద నాయి బ్రాహ్మణ కుటుంబంలో 1924- జనవరి 24న గోకుల్ ఠాకూర్ – రామ్ దులారి దేవి దంపతులకు జన్మించారు సామాజిక సమానత్వ సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేశారన్నారు.భారత రాజకీయాల్లో ఒక నిశ్శబ్ద సేవలతో చరిత్ర నిలిచిపోయారని, వెనుకబడిన తరగతుల హక్కుల కోసం పోరాటం చేశారని, ఓ బి సి విద్యార్హతలు ఉద్యోగాలలో రిజర్వేషన్ 27 శాతానికి దేశంలోనే తొలిసారి అసెంబ్లీలో తీర్మానం చేసి, రిజర్వేషన్ కల్పించారని కొనియాడారు.1952లో ఎమ్మెల్యేగా, 1967లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి, 1970- 71 1977- 79 రెండు పర్యమాలు బీహార్ ముఖ్యమంత్రిగా పని చేశారని ఆయన సామాజిక సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందన్నారు.దేశంలోనే నాయి బ్రాహ్మణులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కార్పరి ఠాకూర్ కరుణానిధి తమిళనాడు సీఎం స్టాలిన్ ఆదర్శంగా తీసుకొని నాయి బ్రాహ్మణ హక్కుల కోసం పోరాడాలి నాయి బ్రాహ్మణ ఐక్యత వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కొలిపాక రమేష్, టౌన్ అధ్యక్షులు కొయ్యల రమేష్,కార్యదర్శి విజయగిరి రాజయ్య, పందిళ్ళ రాజయ్య,దడిగల శేఖర్, పోలాస మల్లేష్, పసునూటి రవీందర్,మొగిలిచర్ల రాజు దడిగల శ్రీనివాస్ అడ్డూర్ శ్రీకాంత్, చేరాల మొగిలి, పందిళ్ళ నాగరాజ్ ,అడ్డు రి శ్రావణ్ పాల్గొన్నారు.