సీఎం రేవంత్ ను కలిసిన 104 ఉద్యోగులు..

నవతెలంగాణ – ఆర్మూర్
104 ఉద్యోగులు తమ సమస్యలపై  హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ను గురువారం కలవడం జరిగింది. గత 16 సంవత్సరాలనుండి 104 ఉద్యోగులుగా ఉన్న మమ్మల్ని కనీసం కాంట్రాక్టు లేదా రెగ్యులర్ ఉద్యోగులుగు గుర్తించాలని, ఉద్యోగ భద్రతా కల్పిస్తూ నెల నెలా జీతాలు వచ్చేలా చేయాలని విన్న వించడం జరిగింది. మా సమస్యలను తెలుసుకొని సానుకూలంగా స్పందిస్తూ  పరిశీలించాలని సెక్రెటరీ కి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో యస్వాడ ప్రకాష్, కే.కృష్ణ, జి. కృష్ణా,ప్రకాష్, ప్రవీణ్, పురుషోత్తం, రమేష్ తదితర 104 సిబంది పాల్గొన్నారు.