108 అంబులెన్స్‌లో ప్రసవం

 Adilabadనవతెలంగాణ-కాసిపేట
మండలంలోని కొండాపూర్‌ శివారులో 108 అంబులెన్స్‌లో మహిళకు ప్రసవం జరిగింది. తుడుంగూడ గ్రామానికి చెందిన చాకటి కళావతికి పురటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబీకులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. గ్రామానికి వెళ్లి అంబులెన్‌లో ఎక్కించుకొని కాసిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసువెళ్తున్న క్రమంలో కొండాపూర్‌ గ్రామ శివారుకు రాగానే నొప్పులు తీవ్ర కావడంతో అంబులెన్స్‌లోనే నార్మల్‌ డెలవరీ చేశారు. మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లీబిడ్డలను చికిత్స నిమిత్తం పీహెచ్‌సీకి తరలించారు. కాసిపేట 108 సిబ్బంది ఈఎంటీ డి.ఆత్మారావు, పైలెట్‌ ఎండీ ఆసద్‌ పాషాలకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.