
కాళేశ్వరం మహాశివరాత్రి జాతరలో 108 అత్యవసర సేవలను వినియోగించుకోవాలని మెడికల్ టెక్నీషియన్ మహేష్ కోరారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ భావిష్ మిశ్రా, డీఎంహెచ్వో ఆదేశాల మేరకు కాళే శ్వరంలో మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని నేటి నుండి 9వ తేదీ వరకు 108 అంబులెన్స్ ను టెంపుల్ దగ్గర అత్యవసర సేవల కొరకు అందుబాటులో ఉంచడం జరిగింది. భక్తులు, కాళేశ్వరం పరిసర ప్రాంతాల ప్రజలందరూ 108 సేవలను వినియోగించుకోవాలనివారు కోరడమైనది. వారితో పాటు పైలెట్ చంద్రయ్య పాల్గొన్నారు.