108 సిబ్బందికి ఉత్తమ ప్రశంస పత్రాలు అందజేత

నవతెలంగాణ – మల్హర్ రావు/మహా ముత్తారం
మహాముత్తారం మండల కేంద్రంలో  ఉన్న 108 అంబులెన్స్ లో విధులు నిర్వహిస్తున్న పైలెట్స్ వేముల స్వామీ, పైడాకుల సంపత్ లు మండల ప్రజలకు అందిస్తున్న సేవలకు గాను ఉత్తమ ప్రశంస పత్రాలు అందుకున్నారు.ఈ సందర్భంగా108 అంబులెన్స్ లో అత్యవసర సేవలు అందిస్తూ,అంబులెన్స్ మెయింటెనెన్స్ చూసుకుంటూ బెస్ట్ కేఎంపిఎల్ గత ఆరు నెలలుగా రిపోర్ట్స్ ప్రకారం ఎన్నో అత్యవసర సేవలు అందిస్తూ, బెస్ట్ కేపీఎల్ తీసుకువచ్చినందుకు ఈఎమ్ఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ గుర్తించి వారిని గుర్తించి బెస్ట్ ఉత్తమ పైలట్ గా, స్టార్ అవార్డ్స్ ప్రశంస పత్రాలను భూపాలపల్లి జిల్లా మేనేజర్ మెరుగు నరేష్ యాదవ్ చేతుల మీదుగా అందజేశారు. అత్యవసర సేవలు మండలంలోని ప్రజలకు అందిస్తూ ఇంకెన్నో బెస్ట్ ఉత్తమ అవార్డ్స్ తీసుకోవాలని మేనేజర్ ఆకాంక్షించారు.