108 అంబులెన్స్ లో మహిళ ప్రసవం. తల్లి బిడ్డ క్షేమం

 నవతెలంగాణ – ఆర్మూర్ 
వెల్పూర్ మండలం  కొత్తపల్లి ఎన్ గ్రామంలో గర్భిణీ మహిళకు పురిటినొప్పులు రావడంతో స్థానికులు 108 అంబులెన్స్ కు  ఫోన్ చేశారు . పట్టణ  అంబులెన్స్ సిబ్బంది గ్రామానికి చేరుకొని భాగ్యశ్రీ 29 సంవత్సరాలు గర్భిణీ మహిళాను 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గ మధ్యంలో గోవిందపేట్ గ్రామ సమీపంలో భాగ్యశ్రీ కి పురిటి నొప్పులు అధికం కావడంతో వాహనాన్ని పక్కన నిలిపి భాగ్యశ్రీ కి సుఖ ప్రసవం చేశారు భాగ్యశ్రీ నాలుగవ కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది  .ఆర్మూర్ ప్రాంత ఆసుపత్రికి తరలించడం జరిగింది తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది గణేష్, అరుణ్ లు తెలిపారు.