నవతెలంగాణ- గాంధారి: గాంధారి మండలంలోని సోమారం తండా కి చెందిన దారావత్ కళ్యాణి కి పురిటి నొప్పులు రావడంతో సహాయం కొరకు 108 కి కాల్ చేశారు అక్కడికి వెళ్లిన 108 సిబ్బంది కమలాకర్, నరేష్ ధరవత్ కల్యాణి కి 2 వ కనుపూ కావడం వల్ల నొప్పులు ఎక్కువ రావడం వల్ల గాంధారి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే మార్గం మధ్యలో నొప్పులు ఎక్కువ రావడం తో 108 సిబ్బంది దారావత్ కళ్యాణి కి కాన్పును అంబులెన్సులొనే చేశారు. బాబు పుట్టాడు తరువాత తల్లి ని బాబు ని గాంధారి ప్రభుత్వ హాస్పిటల్ కీ తరలించారు దారావత్ కళ్యాణి భర్త 108 సిబ్బంది కమల కార్, నరేష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.