109 సర్వే నెంబర్ పుల్యాల వసంతకిచ్చిన పట్టా రద్దు చేయాలి

– తుమ్మల వెంకటరెడ్డి సిపిఐఎం ములుగు జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో 19 సర్వే నంబర్ పుల్యాల వసంతకు చెందిన పట్టాను రద్దు పరచాలని సిపిఐ ములుగు జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం పసర గ్రామంలో 109 సర్వే నెంబర్ లో పేదలు వేసుకున్న గుడిసెలకు సిపిఐ ఎం పార్టీ ఆధ్వర్యంలో గృహప్రవేశాలు చేశారు. ఈ సందర్భంగా గుడిషవాసులు సిపిఐ ఎం కార్యాలయం నుండి గుడిసెలు వేసుకున్న ప్రదేశం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే భూస్వాములు ప్రత్యక్షంగా పరోక్షంగా గుడిశవాసులపై, సిపిఎం పార్టీ నాయకులపై, తప్పుడు కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు వాస్తవంగా గత 60 ఏళ్లుగా కేసులో ఉన్న భూమి 30 ఎకరాలు మాత్రమేనని ఎస్.కె రాఘవాచారి పేరు మీద 30 ఎకరాలే పట్ట ఉన్నదని రాఘవాచారి దత్తపుత్రుడు పుల్లెల కృష్ణారెడ్డికి 40 ఎకరాల పట్టా రెవెన్యూ అధికారులు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు.
అదేవిధంగా కౌలు రైతు కూడా కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేశారని కృష్ణారెడ్డి కేసు పెడితే మరో కేసు నమోదు చేశారని ఏ కేసులు పెట్టిన భూస్వాములు సిపిఎం నాయకులు పై గుడిసె వాసులపై ఎన్ని కేసులు అయినా గుడిసవాసల హక్కుల కొరకు పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వీరిద్దరూ అనర్హులు లేనని పేర్కొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా ప్రభుత్వం భూమి గా ప్రకటించి గుడిసె వాసులకు పట్టాలి వాళ్ళని డిమాండ్ చేశారు. పుల్లాల వసంతకిచ్చిన పదికరాల పట్టా రద్దు చేయాలని రెవెన్యూ పట్టా ఇచ్చిన అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు లేనియెడల భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు పుదిల్లా చిట్టిబాబు, తీగల ఆదిరెడ్డి కడారి నాగరాజు అంబాల పోశాలు అంబాల మురళి, గిట్టబోయిన రమేష్, పల్లపురాజు, రాజేశ్వరి సువర్ణ, శారద స్వరూప సరిత, యానాల ధర్మారెడ్డి, బూర శ్రీనివాస్, పంజాల శీను తదితరులు పాల్గొన్నారు.