నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సోమవారం 10వ తరగతి పరీక్షలు రాయడానికి విద్యార్థులు సకాలంలో చేరుకున్నారు. మొదటి రోజు ఆదర్శ పాఠశాలలు 220 మంది విద్యార్థు, నీల జిల్లా పరిషత్ పాఠశాలలో 121 మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కాగా, ఒక విద్యార్థి మాత్రం గైరాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి గణేష్ రావు పేర్కొన్నాడు. 338 మంది విద్యార్థులకు గాను 337 మంది విద్యార్థులు నేడు పరీక్షలకు హాజరయ్యారని ఆయన తెలిపారు. విద్యార్థిని విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారని ఆయన తెలిపారు.