
విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు పదవ తరగతి నుండి పునాది పడుతుందని పదవ తరగతిలో ఉత్తమ ప్రతిమ కనబరిచిన విద్యార్థులకు భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ అన్నారు. ఎన్.ఎస్. యు.ఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో భీమ్‌గల్ పట్టణ కేంద్రంలోని బోయిగల్లీలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి లో ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 సాధించిన కొఠారి అపూర్వ తోపాటు మిగిలిన విద్యార్థులకు ఎంఈఓ స్వామి , పాఠశాల ఉపాధ్యాయులు లింబాద్రి, రాములు, వినోద్ ల సమక్షంలో సన్మానించారు. ఈ సందర్భంగా సయ్యద్ రెహమాన్ మాట్లాడుతూ ఉన్నత విద్య కు మార్గం పదో తరగతి ఫలితాలని పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని, ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరును తీసుకువచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు తెలియజేశారు. అలాగే విద్యార్థులలోని ప్రతిభను వెలికి తీసి వారికి విద్యాబుద్ధులు నేర్పి వారి ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టిన పాఠశాల ఉపాధ్యాయుల కు అభినందనలు తెలిపారు, అలాగే భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు ఇదేవిధంగా కృషిచేసి ప్రభుత్వ పాఠశాలను రాష్ట్రస్థాయిలో ఉన్నత పాఠశాలగా దిద్దాలని అలాగే విద్యార్థులు కూడా క్రమశిక్షణతో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని నీతి నియమాలు విలువలతో కూడిన విద్యను అందిపుచ్చుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ ఎన్.ఎస్.యు.ఐ ప్రధాన కార్యదర్శి మొండి దినేష్ , భీమ్‌గల్ మండల ఎన్.ఎస్.యు.ఐ ఉపాధ్యక్షులు గౌరు ప్రశాంత్ ఎన్.ఎస్.యు.ఐ నాయకులు సుధీర్,వినయ్, పవన్, శ్రీకాంత్, నితిన్, రిషి, రాము, రిశ్వంత్, హైమద్ తదితరులు పాల్గొన్నారు.