
ఈనెల 18 నుండి జరగబోయే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన సెట్-2 ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్లో భద్రపరచడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య తెలిపారు.మండలంలోని 4 పరీక్ష కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 154 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా,22మంది విద్యార్థులు సప్లమెంటరీకి చెందినవారు,గిరిజన గురుకుల, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఒక్కో దాంట్లో 180 మంది చొప్పున,అదేవిధంగా మేరీ మదర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 150 మంది విద్యార్థులు మొత్తం కలిపి 686 మంది విద్యార్థులు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.ఈ పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపర్డెంట్లుగా కొండగడుపుల యాకయ్య,అశోక్ రెడ్డి,ప్రభాకర్, అశోక్,డిపార్ట్మెంట్ ఆఫీసర్లుగా శ్రీనివాస్,వెంకట్,కృష్ణయ్య, సోమయ్య లు విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పరీక్ష పత్రాలను పటిష్ట బందోబస్తు మధ్య లాకప్ రూమ్ లో భద్రపరిచినట్లు తెలిపారు.