విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకం

– ఎన్నారై రవి పులి, సహకారంతో ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీ 
నవతెలంగాణ -తాడ్వాయి 
ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించాలని ఎన్నారై రవి పులి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. గురువారం మండలంలోని కాటాపూర్ జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ఉపయోగపడే, 15000 రూపాయల విలువ చేసే ఆల్ ఇన్ వన్ గైడ్స్ బుక్స్ ను 30 మంది విద్యార్థులకు, వారి సోదరుడు, కాటాపూర్ మాజీ సర్పంచ్ పులి నర్సయ్య గౌడ్ చేతుల మీదుగా, ప్రధానోపాధ్యాయులు బాణాల సుధాకర్ సమక్షంలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో కూడిన విద్యుత్ తోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అని అన్నారు. విద్యార్థి చదువుకొని జీవితంలో మంచి ప్రయోజకులు కావాలని సూచించారు. అంతేకాకుండా విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లో కూడా రాణించాలని అందుకు అవసరమైన ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జీవన్ లాల్, కోడూరి సమ్మయ్య, సుతారి పాపారావు, గోరంట్ల రాజేష్, జయపాల్, వెంకటేశ్వర్లు, సామ్సంన్, మోహన్, ఫిజికల్ డైరెక్టర్ (పిడి) విజయ, శ్రీదేవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.