నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ దూరవిద్య పరీక్షలు వచ్చేనెల 25 నుంచి మే రెండో తేదీ వరకు జరుగుతాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు విడతల్లో జరుగుతాయని వివరించారు. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు మే మూడు నుంచి పదో తేదీ వరకు ఎనిమిది రోజులపాటు నిర్వహిస్తామని తెలిపారు.