పదవ తరగతి ఉత్తీర్ణతను దృష్టిలో ఉంచుకోవాలి

–  దేశి రామ్ నాయక్ ఏ టి డి ఓ
నవతెలంగాణ-గోవిందరావుపేట: పదవ తరగతి ఉత్తీర్ణతను దృష్టిలో ఉంచుకొని స్టడీ డ్యూటీ చేయాలని ఏటీడీవో దేశీ రామ్ నాయక్ అన్నారు. బుధవారం మండలంలోనికర్లపల్లి ఆశ్రమ పాఠశాలను దేశీ రామ్  నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు 100 డేస్ ప్రోగ్రాం సక్రమంగా నిర్వహిస్తున్నారా అని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.కల్తి. శ్రీనివాస్ ని అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ 10వ,తరగతి ఉత్తిర్ణత దృష్టిలో ఉంచుకొని స్టడీ డ్యూటీ చేయాలని, సెలవు రోజుల్లో టర్మ్ డ్యూటీలు ఉపాధ్యాయులు చేయాలని చెప్పారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని వార్డెన్ బాలు కి సూచించారు, అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు, స్టాక్ రిజిస్టర్, స్టోర్ రూమ్ పరిశీలించారు. 10వ, తరగతి ఉపాధ్యాయులకు లెసన్ ప్లాన్,టీచర్ డైరీ కచ్చితంగా ఉండాలని,ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ని పాఠశాల కు సంబంధించిన అన్ని రికార్డులను అడిగి పరిశీలించడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులు 10/10 రిజల్ట్ తీసుకురావాలని సూచించారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.