పదవ తరగతి ఉత్తీర్ణత  100% సాధించాలి: డీఈవో

నవతెలంగాణ – మిరు దొడ్డి
పదవ తరగతి పరీక్షల్లో ప్రతి ఒక్కరు 100% ఉత్తీర్ణత సాధించాలని డీఈవో శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మిరుదొడ్డి మండల కేంద్రం లోని మోడల్ స్కూల్లో దుబ్బాక నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా డిఇఓ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని ఉపాధ్యాయులు మెరుగైన విద్యా బోధన చేయాలని సూచించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని అన్నారు. రాబోయే పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యాబోధన చేయాలన్నారు. 100% ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయుల పట్ల చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాస్, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు ప్రవీణ్ ప్రభుదాస్ తోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.