– ఆస్పత్రికి తరలింపు.. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో ఘటన
నవతెలంగాణ-న్యాల్‌కల్
న్యాల్‌కల్ ప్రభుత్వ కేజీబీవీ హాస్టల్‌లో శుక్రవారం 11 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దాంతో వారిని వెంటనే జహీరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. దగ్గు, వైరల్ ఫీవర్ వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్టు ఎస్‌ఓ పర్వీన్ బేగం తెలిపారు. కాగా ఈ ఘటన గురించి తెలియగానే డీఈఓ వెంకటేశ్వర్లు కేజీబీవీని సందర్శించారు. ఎంఈఓతో కలిసి హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎస్‌ఓకు ఆదేశించారు. అపరిశుభ్రంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.