
నవతెలంగాణ – కంఠేశ్వర్
నగరంలోని నాలుగవ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేసినట్లు నాల్గవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం..మహాలక్ష్మి నగర్ కాలనీ లో పేకాట ఆడుతున్న11 మందిని అరెస్టు చేసామన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద రూ.72,470 నగదు స్వాధీనం చేసుకుని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.