‘మైనార్టీ బంధు’కు 11వేల దరఖాస్తులు

– నేడు మొదటి విడత చెక్కుల పంపిణీ
– 497 మందికి ఆర్థిక సాయం
– మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా అందజేత
– ఈ నెలాఖరులోగా రెండో విడత..
నవతెలంగాణ-సిటీబ్యూరో
‘మైనార్టీ బంధు’ లబ్దిదారులకు చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమైంది. నేడు మేడ్చల్‌ కలెక్టరేట్‌లో కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చేతుల మీదుగా చెక్కు లను అందజేయను న్నారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 11వేల దరఖాస్తులు అందాయి. మొదటి విడతలో 514 మంది లబ్ది దారులకు అందజేయాల్సి ఉండగా.. శనివారం 497 మందికి చెక్కులను పంపిణీ చేసి మిగతా 17 మందికి మరో రెండ్రోజుల్లో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్దిదారునికి రూ.లక్ష చొప్పున రూ.4కోట్ల 97 లక్షలను పంపిణీ చేస్తారు. ఈ నెలాఖరులోగా రెండో విడతలో భాగంగా మరో 600 మందికి అందజేయనున్నట్టు అధికారులు చెప్పారు.
దళిత, బీసీ బంధు తరహాలో ఆర్థికంగా వెనుకబడిన మైనార్టీ వర్గాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘మైనార్టీ బంధు’కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా 100శాతం సబ్సిడీతో రూ.లక్ష సాయం అందిం చేందుకు ఉత్త ర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు దర ఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా.. ఆ తర్వాత లబ్ది దారుల ఎంపిక చేప ట్టారు. జిల్లాలో 514 మంది లబ్దిదారులను మొదటి విడతకు ఎంపిక చేశారు. శనివారం మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఒక్కొక్కరికి రూ.లక్ష చెక్కులను మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అందజేయనున్నారు.
రెండో విడతలో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో 120 మంది చొప్పున ఐదు నియోజకవర్గాల్లో 600 మందికి ఈ నెలాఖరులోగా అందజేయనున్నారు.
‘మైనార్టీ బంధు’ పథకానికి మేడ్చల్‌- మల్కాజి గిరి జిల్లా వ్యాప్తంగా 11 వేల దరఖాస్తులు వచ్చాయి. అల్వాల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 26, మూసాపేట (బాలానగర్‌) జీహెచ్‌ంఎసీ పరిధిలో 46, కూకట్‌పల్లి జీహెచ్‌ఎంసీ పరిధిలో 84, మల్కాజిగిరి జీహెచ్‌ఎంసీ పరిధిలో 60, కాప్రా జీహెచ్‌ఎంసీ పరిధిలో 32, ఉప్పల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 28, కుత్బుల్లాపూర్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 103, జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 30, తూంకుంట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 3, బోడుప్పల్‌ 6, పీర్జాదిగూడ 8, నాగారం 2, దమ్మాయిగూడ 4, పోచారం 8, ఘట్‌కేసర్‌ పరిధిలో 4, నిజాంపేట పరిధిలో 12, దుండిగల్‌ గండిమైసమ్మ పరిధిలో 6, మేడ్చల్‌ 4, గుండ్ల పోచంపల్లి 6, కొంపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 6, శామిర్‌పేట మండల పరిధిలో 3, కీసర మండల పరిధిలో 4, ఘట్‌కేసర్‌ మండల పరిధిలో 4, మేడ్చల్‌ మండల పరిధిలో 4, మూడుచింతలపల్లి మండల పరిధిలో నలుగురు లబ్దిదారులను ఎంపిక చేశారు. మరో 17 మందికి రెండ్రోజుల్లో ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఎన్నికల లోపే మొత్తం లబ్దిదారులకు ఆర్థిక సాయం అందించేలా సర్కార్‌ భావిస్తున్నట్టు సమాచారం.
ఏర్పాట్లు పూర్తి
మొదటి విడత ‘మైనార్టీ బంధు’ రూ.లక్ష సాయం చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. నేడు కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా చెక్కు లను అందజేస్తాం. త్వరలోనే రెండో దశ పంపిణీ కూడా చేపడుతాం. విడతల వారీగా లబ్దిదా రులందరికీ అందజేసేందుకు కృషి చేస్తాం.
మహ్మద్‌ ఖాసీం, జిల్లా మైనార్టీ
సంక్షేమశాఖ అధికారి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా