అమరావతి: గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని పిసిసి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ ద్వారా సిఎం చంద్రబాబుకు ఆమె విజ్ఞప్తి చేశారు. గ్రూప్-2 డిప్యూటీ పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గ్రూప్-1, 2 పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండటం, కేవలం మూడు వారాల వ్యత్యాసంలోనే రెండు పరీక్షలు జరగడం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌లోనే ప్రిలిమ్స్ పరీక్షలు పెట్టడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని పేర్కొన్నారు. అభ్యర్థుల జీవితాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ విషయంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.