1,188 మంది నామినేషన్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను 119 నియోజకవర్గాల్లో 1,188 మంది 1,345 నామినేషన్లను దాఖలు చేసినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 1,518 నామినేషన్‌ సెట్లు దాఖలయ్యాయి. కాగా వీరిలో 1,431 అఫిడవిట్లను అప్‌లోడ్‌ చేశారు. ఇంకా 87 అఫిడవిట్‌లు ఫైల్‌ చేయాల్సి ఉన్నది.