ఈ నెల 11న రమాబాయి అంబేద్కర్ జయంతి

– మంత్రి శ్రీదర్ బాబుకు ఆహ్వానం పలికిన ఏయువై సొసైటీ సభ్యులు
– ఆహ్వాన కరపత్రిక అందజేత
– సానుకూలంగా స్పందించిన దుద్దిళ్ల
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత రాజ్యాంగ నిర్మాత, బారత రత్న డా.బాబా సాహెబ్ అంబెడ్కర్  సతీమణి మాత రమాబాయి అంబేద్కర్ 126వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అల్ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ 542 (ఏఈడబ్ల్యుఎస్) జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్ల శంకర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 11న ఆదివారం మల్హర్ మండలంలోని కొయ్యుర్ కమ్యూనిటీ హాల్లో రమాబాయి అంబెడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని,ఈ జయంతి ఉత్సవాలకు హాజరు కావాలని తెలంగాణ ఐటి,పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబును మంగళవారం కాళేశ్వరం జోనల్ ఏవైయు అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ జయంతి ఆహ్వాన కరపత్రాన్ని అందజేశారు.ఇందుకు దుద్దిళ్ల సానుకూలంగా స్పందించి  వీలైనంత వరకు హాజరయ్యేలా చూస్తానని తెలిపినట్లుగా వెల్లడించారు.