బివిఎం ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ కలిసి బామ్ సెఫ్ 11 వ రాష్ట్ర మహాసభల కరపత్రాలను మంగళవారం విడుదల చేశారు.ఈ సందర్బంగా భారతీయ విద్యార్థి మోర్చ రాష్ట్ర కార్యదర్శి జీవియం విఠల్ మాట్లాడుతు సెప్టెంబర్ 1న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే బామ్ సెఫ్ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలనీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తో కలిసి కరపత్రలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ దేశంలో ఈవీఎం లను రద్దు చేయాలనీ కొన్ని సంవత్సరాలుగా బామ్ సెఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామన్నారు. ఈవీఎం హ్యాకింగ్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయని నిరూపించారు. అందుకే ఈవీఎం లను రద్దు చేయాలని,బీసీల కులాదారిత జన గణన వెంటనే చేపట్టాలని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటైజేషన్ చేయడం ఆపాలని, జాతీయ విద్యా విధానం 2020 ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడాలని, ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందన్నారు.ఈ మహాసభలకు విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు హజిరై విజయవంతం చేయాలనీ కోరుతున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల బివియం బాద్యులు శివ కుమార్, శ్రవణ్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.