– రూ.200 కోట్ల ఎన్‌సిడిల జారీ
– తెలుగు రాష్ట్రాల్లో 20 కొత్త శాఖలు
– సంస్థ హెడ్ ఉమేష్ మోహనన్ వెల్లడి
హైదరాబాద్ : పసిడి తనఖా రంగంలో గుర్తింపు పొందిన ఎన్‌బిఎఫ్‌సిలల్లో ఒక్కటైన ఇండెల్ మనీ సెక్యూర్డ్, రీడిమబుల్ నాన్ కన్వర్టేబుల్ డిబెంచర్లు (ఎన్‌సిడి)లను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ బిజినెస్ హెడ్ జిజిత్ రాజ్‌తో కలిసి ఎగ్జిక్యూటివ్ హోల్ టై డైరెక్టర్ ఉమేష్ మోహనన్ మాట్లాడుతూ.. ఎన్‌సిడిల ద్వారా రూ.200 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపారు. రూ.1,000 ముఖ విలువ కలిగిన ఈ ఎన్‌సిడిలపై ఏడాదికి గరిష్టంగా 12.25 శాతం వడ్డీని అందిం చనున్నా మన్నారు. కనీసం ఏడాది, గరిష్టంగా 72 నెలల కాలపరమితితో ఎన్‌సిడిలు జారీ చేయబడుతాయన్నారు. మదుపర్ల పెట్టుబడి ఆరేళ్లలో రెట్టింపు కానుందని తెలిపారు. ఈ ఎన్‌సిడిల ఇష్యూ జనవరి 30న ప్రారంభమై.. ఫిబ్రవరి 12తో ముగియనుందన్నారు. ఒక్క లాట్‌లో కనీసం 10 ఎన్‌సిడిలను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరుసగా తమకు 18, 20 చొప్పున శాఖలున్నాయన్నారు. ఎపిలో మరో 8, తెలంగాణలో అదనంగా 12 శాఖలను తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వీటిని ద్వితీయ, తృతీయ శ్రేణీ నగరాల్లో అందుబా టులోకి తేనున్నామన్నారు. దేశ వ్యాప్తంగా తమ సంస్థకు 250 పైగా శాఖలున్నాయని.. 2025 మార్చి ముగింపు నాటికి 425 శాఖలకు విస్తరిం చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లోనే 78 కొత్త శాఖలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రతీ శాఖకు కనీసం రూ.18 లక్షల పెట్టుబడి అవసరం అవుతుందన్నారు. 2023 మార్చి 31 నాటికి రూ.817.41 కోట్ల ఎయుఎం కలిగి ఉందన్నారు. తమ మొత్తం పోర్టుపోలి యోలో పసిడి రుణాల వాటా 82 శాతంగా ఉందన్నారు. ఇంతక్రితం మూడు ఎన్‌సిడి ఇష్యూల్లో రూ.260 కోట్ల నిధులు సమీకరించామన్నారు.