తెలంగాణ రాష్ట్రంలో మాదిగల 12 శాతం రిజర్వేషన్లు కేటాయించాలి

– మాదిగ జేఏసి వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి 
నవతెలంగాణ కంఠేశ్వర్ : తెలంగాణ రాష్ట్రంలో మాదిగల12 రిజర్వేషన్లు కేటాయించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి అన్నారు. ఈ మేరకు శుక్రవారం మాదిగల మేలుకొలుపు యాత్రలో భాగంగా నిజామాబాదు రైల్వే కమాన్ లో గల బాబు జగ్జీవన్ రామ్ కి పూల మాల వేసి మాట్లాడారు.  తెలంగాణలో మాదిగల జనాభాకు అనుగుణంగా 12శాంతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జిల్లాల వారీగా వర్గీకరణ అమలు చేయాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విజ్ఞప్తి చేసారు . ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా అయితే జిల్లాల వారిగా వర్గీకరణ అమలు చేస్తాం అన్నారో  తెలంగాణలో కూడా అలాగే అమలు చేయాలని అప్పుడే మాదిగలకు న్యాయం జరుగుతుందని అన్నారు.  వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన చేయాలని లేకుంటే మాదిగలకు అన్యాయం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ, జిల్లా నాయకులు  విజయ్ మాదిగ, ప్రశాంత్ మాదిగ,  జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్ జిల్లా నాయకులు శంకర్, గణేష్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు.