నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు నుండి విశేష స్పందన లభిస్తున్నదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 1,203 దరఖాస్తులు అందాయనీ, వీటి స్వీకరణకు 16 కౌంటర్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పౌరసరఫరాల శాఖ, పంచాయతీరాజ్, ఆరోగ్యశాఖ, ఉపాధి, విద్య, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ పశుసంవర్థక శాఖ, పరిశ్రమలు, అటవీ, విద్యుత్, నీటిపారుదల, దేవాదాయ తదితర శాఖలకు సంబంధించి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు తమ అర్జీలను సులభంగా అధికారులకు అందచేశారని వివరించారు.