హైదరాబాద్ : బ్యాంకింగేతర విత్త సంస్థ క్లిక్స్ కాపిటల్ 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 125 శాతం వృద్ధితో రూ.63 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించింది. ఈ ఎంఎస్‌ఎంఈ రుణాలపై అధికంగా దృష్టి సారించే ఈ సంస్థ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) 31 శాతం పెరిగి రూ.5,872 కోట్లకు చేరింది. ఇది 2022-23లో రూ.4431 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక ఆస్తులు 2.48 శాతం నుంచి 1.91 శాతానికి దిగివచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది.