ఘనంగా సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతి  

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
సుభాష్ చంద్రబోస్ 126 వ జయంతిని మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని  అంబేద్కర్ చౌరస్తాలో అన్ని పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భారత దేశ జాతీయ సైన్యాన్ని ఏర్పరిచి బ్రిటిష్ వారిపై ప్రత్యక్ష పోరాటం చేసిన ఘనత సుభాష్ చంద్రబోస్ దే అని అన్నారు. ఇప్పటికీ ఆయన స్థాపించిన ఆర్మీ పేరుతోనే ఇండియా ఆర్మీ పనిచేస్తుందన్నారు. ఇండియా కాంగ్రెస్  అధ్యక్షుడుగా రెండు పర్యాయాలు పనిచేశారని పేర్కొన్నారు. అండమాన్ నికోబార్ దీవులలో ఆయన పేరు మీద ఒక దీవిని ప్రకటించారన్నారు. కేంద్ర ప్రభుత్వం పరాక్రమ దివస్ గా, భారత్ ప్రేమ్ దివస్ గా పిలుస్తుంది కానీ ఆయనకు గుర్తింపుగా పోస్టల్ స్టాంప్ మీద గాని, కరెన్సీ నోట్లపై సుభాష్ చంద్రబోస్ ఫోటోను ముద్రించి గౌరవం ఇవ్వడం లేదన్నారు. గత ప్రభుత్వాలు సుభాష్ చంద్రబోస్ త్యాగాలను రాజకీయ కోణంలోనే చూశాయన్నారు.  ఈ పార్టీలకు చిత్తశుద్ధిగా ఉంటే ఐక్యమత్యంగా వచ్చే పార్లమెంటు సమావేశాలలో కనీసం దేశంలో ఒక్క రాష్ట్రానికైనా ఆయన పేరు పెట్టి ఆయన త్యాగాన్ని గుర్తించే  అవసరం ఉందన్నారు. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్  తప్పకుండా ఏర్పాటు చేయాలని అన్ని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, బిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్ ఎలగందుల శంకర్,   రైతు సంఘం నాయకులుకవ్వ వేణుగోపాల్ రెడ్డి,  కవ్వ రాజిరెడ్డి   ,బిసి సంఘం పట్టణ అధ్యక్షులు చొక్కా చారి, బిజెపి నాయకులు పోలోజు రాజేందర్, వెంకటేష్ గౌడ్, బీసీ నాయకులు కోడం ప్రభాకర్,. శరత్, కనకం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.