ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 12వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 29వ తేది స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో హృదయ స్పందన -2023 పేరిట నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సేవా కార్యక్రమాల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారి సంస్థ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పురప్రముఖులు నాయకులు హాజరవుతారని తెలిపారు. జిల్లా ప్రజలు, యువకులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున్న పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు దారం గంగాధర్, మద్ది గంగాధర్, వాల బాలకిషన్, వినయ్ కుమార్, చందా జగన్ మోహన్, సుమీల శర్మ, సుజాత రెడ్డి, జయదేవ్, మయూర్, చందూ, దినేష్ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.