– రెనో 13 సిరీస్ ఆవిష్కరణలో అసీమ్ మథూర్
నవ తెలంగాణ – హైదరాబాద్
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఐడీసీ గణంకాల ప్రకారం ఒప్పోకు 13.9 శాతం వాటా ఉందని ఒప్పో ఇండియా ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ అసీమ్ మాథూర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన ఒప్పో రెనో 13 సిరీస్‌ను విడుదల చేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడు తూ.. గతేడాది స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 47 శాతం వృద్ధిని సాధించామన్నారు. గ్లోబల్ మార్కెట్‌లో 10 కోట్ల రెనో మోడళ్లను విక్రయించామన్నారు. రెనో13 సిరీస్‌కు మంచి మద్దతు లభిస్తుందన్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చిన రెనో 13 సిరీస్ ఫోన్ల ప్రారంభ ధరను రూ.37,999గా నిర్ణయించామన్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 8350 చిప్‌సెట్, ఎఐ రెడీ కెమెరాలతో దీన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మోనోక్రోమో కెమెరాలతో రూపొందించామన్నారు.
మార్కెట్‌లో ఒప్పోకు 13.9 శాతం వాటా
1:55 am