హైదరాబాద్‌ నివాస అమ్మకాల్లో 13 శాతం వృద్థి

– నైట్‌ ఫ్రాంక్‌ వెల్లడి
హైదరాబాద్‌ : ప్రస్తుత ఏడాదిలో సెప్టెంబర్‌ ముగింపు నాటికి హైదరాబాద్‌ నివాస అమ్మకాల్లో పెరుగుదల నమోదయ్యిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ నైట్‌ఫ్రాంక్‌ ఇండియా తెలిపింది. ఈ తొమ్మిది మాసాల్లో 13 శాతం వృద్థితో 59,000 నివాస అమ్మకాలు జరిగాయని వెల్లడించింది. వీటి విలువ పరంగా 34 శాతం వృద్థితో రూ.36,461 కోట్ల అమ్మకాలు చోటు చేసుకున్నాయని పేర్కొంది. కాగా.. గడిచిన సెప్టెంబర్‌ నెలలో మాత్రం 18 శాతం తగ్గి రూ.2,820 కోట్ల అమ్మకాలుగా.. రిజిస్ట్రేషన్ల పరంగా 22 శాతం కోల్పోయి 4,903 యూనిట్లకు పరిమితమయ్యాయి.