బీఆర్ఎస్ లో చేరిన 13 మంది యువత

నవతెలంగాణ- దుబ్బాక రూరల్ :
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన 13 మంది యువత బీఆర్ఎస్ లో ఎంపీ సమక్షంలో శనివారం చేరారు.ఈ సందర్భంగా వారికి మెదక్ పార్లమెంటు సభ్యులు,దుబ్బాక అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దుబ్బాక గడ్డపై తిరిగి బీఆర్ ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు గెలిచి దుబ్బాక ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ని ఇంటికి తరుముతామన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు మల్లుగారి ప్రేమ్, పార్టీ నాయకులు పరమేష్, పర్శా రాములు, తదితరులు ఉన్నారు.