శక్తి పంప్స్‌ లాభాల్లో 130 శాతం వృద్ధి

హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో శక్తి పంప్స్‌ (ఇండియా) లిమిటెడ్‌ నికర లాభాలు 130.09 శాతం పెరిగి రూ.104 కోట్లకు చేరాయి. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.45.2 కోట్ల లాభాలు నమోదు చేసింది. అదే సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.495.6 కోట్లుగా ఉండగా.. గడిచిన క్యూ3లో 31 శాతం పెరిగి రూ.648.8 కోట్లకు చేరింది. ఆర్డర్‌ల అమలు, కార్యాచరణ సామర్థ్యాల పెరుగుదల ద్వారా కంపెనీ బలమైన ఆర్థిక పనితీరును కనబర్చిందని ఆ కంపెనీ ఛైర్మన్‌ దినేష్‌ పాటిదార్‌ పేర్కొన్నారు.