
138 వ మేడేను వాడవాడనా ఘనంగా జరపండి. అని ఐఎఫ్టియు శ్రామిక స్పందన రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సుధాకర్ మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం,శ్రమకు తగిన వేతనం,8గంటల పని దినం కోసం హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమించిన రోజు మేడే ను స్ఫూర్తిగా తీసుకొని మోడీ ప్రభుత్వ నిరంకుశత్వ విధానాలపై పోరాడాలని అన్నారు. కులం,మతం పేరుతో ప్రజలు, కార్మిక వర్గం మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ వైశ్యామ్యాలను పెంచి పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఒక్కొక్కటిగా ఆదాని, అంబానీలకు మోడీ దారాదత్తం చేస్తూ వారి ఆదాయాలు పెంచడానికి అహర్నిశలు కృషి చేస్తుందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల ఒకవైపు భారం మోపడంతో సామాన్యుల ఆదాయాలు తరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక 49 చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను యాజమాన్యాలకు అనుకూలంగా తెచ్చారని విమర్శించారు. 2019 రోడ్డు రవాణా సేఫ్టీ బిల్లు డ్రైవర్ల వృత్తికి మరణ శాసనంగా మారిందని అన్నారు. దేశంలో 45 కోట్ల పైగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు భద్రతతో కూడిన సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. పదేళ్ల పాలన ఒక ట్రైలర్ మాత్రమేనని అసలైన విధానాలను మళ్లీ గెలిస్తే నిరూపిస్తామని మోడీ తెలపడం ను ప్రజలందరూ వ్యతిరేకించాలని పదేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వీరిని గద్దభించేందుకు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత రైతు – కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు.బొట్ల రాజు , శ్రీనివాస్ భారత రైతుకుల సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.