మూడవ రోజు ప్రజాపాలనలో 1389 దరఖాస్తులు స్వీకరణ

నవతెలంగాణ మల్హర్ రావు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో మండలంలో మూడవ రోజు శనివారం కొనసాగింది. కొండంపేటలో 55, దుబ్బపేటలో3, మల్లంపల్లిలో 15, చిన్నతూండ్లలో 55, ఇప్పలపల్లిలో 32, అడ్వాలపల్లిలో 42, తాడిచెర్లలో 582, ఎడ్లపల్లిలో 119, కొయ్యుర్ లో 110, వళ్లెంకుంటలో 291, పెద్దతూండ్లలో 85, మొత్తం 12 గ్రామాల్లో 1389 దరఖాస్తులు లబ్ధిదారుల నుంచి కౌoటర్ నిర్వాహకులు స్వీకరించారు. ప్రజాపాలనలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు పంచాయతీ కార్యదర్శులు షురూ చేసినట్టుగా మండల ఎంపిడిఓ నరహీంహమూర్తి తెలిపారు.ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న ఆరు గ్యారంటీల పథకాలైన మహాలక్ష్మీ, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, ఆహార భద్రత పథకాలకు దరఖాస్తులు సమర్పించారు. ఆయా గ్రామాల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాలను మండల స్పెషల్ అధికారి అవినాష్, ఎంపిడిఓ, తహశీల్దార్ శ్రీనివాస్, కొయ్యుర్ ఎస్ఐ నరేశ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల స్పెషల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.